మెగా చీఫ్ గా గౌతమ్.... మినీ చీఫ్ లుగా హరితేజ, గంగవ్వ!
on Oct 18, 2024
బిగ్ బాస్ హౌస్ లో మెగా చీఫ్ కోసం కంటెస్టెంట్స్ అందరు రెండు క్లాన్ లుగా విడిపోయి.. నువ్వా నేనా అన్నట్టుగా ఆడుతున్నారు. గత సీజన్ లో కెప్టెన్ ఇప్పుడు మెగా చీఫ్ అన్నమాట. మెగా చీఫ్ కి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ముఖ్యంగా నామినేషన్ నుండి మినహాయింపు ఉంటుంది. ఇంకా బిగ్ బాస్ కి సంబంధించి హౌస్ లో వారం వరకు పవర్స్ ఉంటాయి.
అయితే మొదటి మెగా చీఫ్ గా నబీల్, రెండవ మెగా చీఫ్ గా మెహబూబ్ అయ్యారు. ఇక ఈ వారం గౌతమ్ మెగా చీఫ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గౌతమ్ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన మాజీ కంటెస్టెంట్ అన్న విషయం తెలిసిందే. అయితే ఎప్పుడు లేని విధంగా ఈ వారం మెగాచీఫ్ తో పాటు మినీ చీఫ్ లుగా హరితేజ గంగవ్వ అయినట్టు తెలుస్తుంది.
స్మార్ట్ ఫోన్, స్మార్ట్ ఛార్జ్ లుగా కంటెస్టెంట్స్ గత మూడు రోజుల నుండి ఆడుతున్న ఈ టాస్క్ లో ఒక్కో కంటెస్టెంట్ తమ స్ట్రాటజీలతో ఆకట్టుకున్నారు. అయితే ఈ టాస్క్ లో నిఖిల్, గౌతమ్ , పృథ్వీల మధ్య జరిగిన ఆర్గుమెంట్స్ ఫిజికల్ గా అయ్యాయి. అయితే హౌస్ లో నిన్న మరో టాస్క్ జరిగినట్టుగా ఇందులో గౌతమ్, గంగవ్వ చివరి వరకు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే మెగా ఛీఫ్ గా గౌతమ్ అయ్యాక.. తనకి సపోర్ట్ గా గంగవ్వ, హరితేజలని తీసుకున్నాడని తెలుస్తుంది. మరి టాస్క్ లో ఎవరు ఎలా ఆడారు.. అసలు గౌతమ్ మెగా ఛీఫ్ ఎలా అయ్యాడో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే.
Also Read